ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు
నవతెలంగాణ – కామారెడ్డి
తండాలకు వెళ్లే రోడ్లను రవాణాకు అనుకూలంగా మార్చాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాలోత్ హరిలాల్ నాయక్ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజేపల్లి గ్రామంలోని మోటార్ పడ్డ లోది తాండ, సిక్కులోని లొద్ది తాండ, కొత్తగూడెం తాండ, రోడ్డు మంజూరు అయి ఆరు నెలలుగా అవుతున్నా కాంట్రాక్టర్లు నిర్మాణం మొదలు పెట్టడం లేదన్నారు. ఈ వర్షాకాలంలో వర్షం పడి రోడ్డు మొత్తం బురదమయం అయిపోయిందనీ దీంతో బైకులు, ఆటోలు, ట్రాక్టర్లు ఏ వాహనాలు ఆ రోడ్ల గుండా వెళ్లడానికి అవకాశం లేదన్నారు.
నడవడానికి లేదనీ కనీసం నడిచి వెళ్లాలన్నా కూడా అతి కష్టంగా ఉన్నదనీ, నిత్య అవసరాలకు, హాస్పిటల్లకు, వ్యవసాయదారులు ఊరియా, ఇతర పంటలకు సంబంధించిన వస్తువులు తెచ్చుకోవడానికి, మోటర్ బైక్ మీద తీసుకెళ్లడానికి రోడ్డు మొత్తం బురదమయం కావడం వల్ల భుజాలపై మోసుకొని 600 మీటర్ల దూరం అంటే ఎక్కువ దూరం తీసుకువెళ్లాల్సి వస్తుందన్నారు. మోటర్ పడ్డా లొద్ది లో వాగు పైన బ్రిడ్జి అత్యవసరం ఉన్నదనీ, గత 25 సంవత్సరాల క్రితం పరింగ్య అనే వ్యక్తికి పాము కరచి వాగు దాటలేక చనిపోవడం జరిగింది. మూడు సంవత్సరాల క్రితం బాధావత్ చందర్ అనే వ్యక్తికి పాము కరిచి ఆ వాగు పైనుంచి ట్రాక్టర్, జెసిబి సహాయంతో హాస్పిటల్కు తీసుకెళ్లడం జరిగిందనీ, మా తాండ ప్రజలకు రోడ్డుతో పాటు బ్రిడ్జి కూడా చాలా అవసరం ఉందనీ, ఇకనైనా అధికారులు స్పందించి అతి తొందరగా రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగిందన్నారు.
రోడ్లను రవాణాకు అనుకూలంగా మార్చండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES