నవతెలంగాణ – జుక్కల్
సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. ఒకస్మీకంగా జుక్కల్ మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది డ్యూటీ రిజిస్టర్ ను పరిశీలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్, డ్యూటీ డాక్టర్ డాక్టర్ విట్టల్ లు అందుబాటులో లేకపోవడంతో అగ్రహం వ్యక్తం చేసి వర్షాకాలం అనేక వ్యాధులతో ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రికి వైద్య సేవలు కొరకు వస్తూ ఉంటారు.
ఇలాంటి సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోతే పేద ప్రజలకు ఎవరు వైద్యం చేస్తారని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు వెంటనే ఆస్పత్రి సూపరింటెండెంట్ కు మరి డ్యూటీ డాక్టర్ కు షోకాజ్ నోటీస్ అందించాల్సిందిగా డి సి హెచ్ ఎస్ డాక్టర్ విజయలక్ష్మిని జిల్లా కలెక్టర్ ఫోన్ ద్వారా ఆదేశించారు.
అనంతరం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెక్కులను మహిళలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, జిల్లా కలెక్టర్ అందించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జుక్కల్ తాసిల్దార్ తదితరులు ఉన్నారు.