ఉరుకులు పరుగుల జీవన విధానంతో ఉద్యోగం చేసే మహిళలకు సౌందర్య సాధనాల మీద దష్టి పెట్టే సమయం ఉండట్లేదు. అలాంటివారు ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. ఆ సౌందర్య చిట్కాలేమిటో తెలుసుకుందాం.
జీలకర్ర, క్యాబేజీ జీర్ణశక్తికే కాదు, మేని మెరుపును ఇనుమడింపజేస్తాయి. ఈ రెండింటినీ నీటిలో వేసి కొద్దిసేపు ఉడికించాలి. ఆ నీళ్లు గోరువెచ్చగా అయ్యాక వాటితో ముఖాన్ని కడుక్కోవాలి.
పొద్దు తిరుగుడు పువ్వు గింజల్ని రాత్రిపూట పచ్చిపాలలో నానబెట్టి రుబ్బాలి. ఇందులో చిటికెడు కుంకుమపువ్వు, పసుపు కలిపి రాసుకోవాలి.
చర్మానికి మంచి చేసే గుణం నిమ్మలో పుష్కలం ఇది చర్మం మీద పేరుకున్న మురికిని తొలగిస్తుంది. కొద్దిగా చక్కెర, నిమ్మరసం కలిపి ముఖానికి, శరీరానికి రుద్దాలి. చక్కెర కరిగే వరకు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కోడిగుడ్డలోని తెల్లసొన పోషకాల గని, దానికి తేనె జతచేస్తే ముఖానికి మంచి ఫేస్‌ప్యాక్ యారవుతుంది. తెల్లసొన, తేనె కలిపిన ఈ ప్యాక్ వేసుకుని ఇరవై నిమిషాలు ఉంటే ఆ తర్వాత ముఖం నిగనిగలాడుతుంది.
మేని మెరుపుకై…
- Advertisement -
- Advertisement -