కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై కేసీఆర్ చర్చలు
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచన
కొంతమంది అరెస్టులు ఉండొచ్చని వెల్లడి
ఫాంహౌస్‌లో ముఖ్య నేతలతో సమావేశం
చండీయాగం చేయాలని నిర్ణయం !
నవతెలంగాణ-మర్కుక్
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ఆపార్టీ ముఖ్య నేతలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. కాళేశ్వరంతో ప్రజలు, రైతులకు కలిగిన ఉపయోగాన్ని మరోసారి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది కాళేశ్వరం కమిషన్ కాదని.. కాంగ్రెస్ కమిషన్ అని విమర్శించారు. ఈ నివేదిక వల్ల బీఆర్‌ఎస్‌కు వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పారు. ఎప్పటికప్పుడు కాళేశ్వరంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సూచించారు. కేబినెట్‌లో ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దామని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా న్యాయపరంగా ఎదుర్కొందామని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఊహించిందేనని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని నాయకులకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. కొంతమంది బీఆర్‌ఎస్ నేతలను అరెస్టు చేయొచ్చని, ఎవరూ భయపడొద్దని, అందరూ ధైర్యంగా ఉండండి అని కేసీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదు అన్నవాడు అజ్ఞాని అని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, మరోమారు ఫాంహౌస్‌లో చండీయాగం చేయడానికి కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో నిర్వహించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులున్నారు.
నివేదికతో నష్టం లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES