Tuesday, August 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణకు కాళేశ్వరం గుండెకాయ లాంటిది: హరీశ్ రావు

తెలంగాణకు కాళేశ్వరం గుండెకాయ లాంటిది: హరీశ్ రావు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు రాజమండ్రి వద్ద గోదావరి నదిపై ధవళేశ్వరం బ్యారేజీని కట్టి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో నిలిచిపోయిన సర్ ఆర్థర్ కాటన్ తో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పోల్చారు. కాటన్ మాదిరిగానే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

బ్రిటీష్ పాలనా కాలంలో ధవళేశ్వరం బ్యారేజీని ఆర్థర్ కాటన్ నిర్మించారని… రైతులకు మేలు జరగాలనే ఆకాంక్షతో ఉభయ గోదావరి జిల్లాలనకు సాగునీరు అందించారని హరీశ్ కొనియాడారు. ఆ రోజుల్లోనే కాటన్ మీద బ్రిటీష్ ప్రభుత్వం హెమింగ్టన్ కమిషన్ వేసిందని… ఆ కమిషన్ కాటన్ ను 900 ప్రశ్నలు అడిగి ఎంతో కాలం వేధించిందని తెలిపారు. అయినా, చివరకు ఏం జరిగింది? ఇప్పటికీ గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో కాటన్ నిలిచిపోయారని అన్నారు.

అదే విధంగా చరిత్ర పుటల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ నిలిచిపోతారని చెప్పారు. తెలంగాణకు కాళేళ్వరం గుండెకాయ వంటిదని హరీశ్ అన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ కు కూడా తెలుసని వ్యాఖ్యానించారు. మల్లన్నసాగర్ నుంచి మూసీలోకి నీళ్లు పోయడానికి రూ. 6 వేల కోట్లకు టెండర్లను ఫైనల్ చేశారని… మల్లన్నసాగర్ కాళేశ్వరంలో భాగమేనని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కోసం కాళేశ్వరం, మల్లన్నసాగర్ లాంటి ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -