Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంజనీరింగ్ కళాశాలలో ఇబ్బందులు ఉండొద్దు

ఇంజనీరింగ్ కళాశాలలో ఇబ్బందులు ఉండొద్దు

- Advertisement -

-సౌకర్యాలు కల్పించే బాధ్యత అధికారులదే..!
జిల్లా కలెక్టర్ కె. హైమావతి 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

ఇంజినీరింగ్ కళాశాలలో ఏలాంటి ఇబ్బందులు ఉండొద్దని ,బాలుర, బాలికలకు వేరుగా తాత్కాలిక హాస్టల్ వసతి కొరకు అన్వేషణ చెయ్యాలని, అధికారులను జిల్లా కలెక్టర్ కే హైమావతి ఆదేశించారు.

మంగళవారం హుస్నాబాద్ మండలంలోని గాంధీ నగర్ గ్రామ శివారులోగల పాలిటెక్నిక్ కళాశాల మొదటి అంతస్తులో కొనసాగుతున్న శాతవాహన ఇంజనీరింగ్ కళాశాలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

 మొదటి  విడత కౌన్సిలింగ్ లో ఇంజనీరింగ్ కాలేజీలో 160 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారని కాలేజ్ ప్రిన్సిపాల్ జిల్లా కలెక్టర్ కి తెలిపారు. డిపార్ట్మెంటాల్ అటాచ్డ్ హాస్టల్ సౌకర్యం లేని కారణంగా హాస్టల్ వసతి లేకనే చాలా మంది 2 వ విడత కౌన్సిలింగ్ లో వేరే కళాశాల కి వెళ్ళారని వివరించారు.ఇప్పటివరకు మొదటి సంవత్సరం అన్ని బ్రాంచ్ లలో 91 అడ్మిషన్ తీసుకున్నారని. 3 వ విడత కౌన్సిలింగ్ లో ఇంజనీరింగ్ కళాశాల మరియు డిపార్ట్మెంటాల్ అటాచ్డ్ హాస్టల్ లని పెడితే అడ్మిషన్ లు వస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. అడ్మిషన్ మాత్రం పోకుండా చూడాలని అన్నారు.  తాత్కాలిక హాస్టల్ వసతి  ఏర్పాటు చేయాలని తహసిల్దార్ కి తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాల లో 250 మంది విద్యార్థులు మరియు ఇంజనీర్ విద్యార్థులు లకు సరిపడా నీటి కొరత రాకుండా చూసుకోవాలని మిషన్ భగీరథ డిఈ తో ఫోన్ లో మాట్లాడి పరిష్కరించారు. ఐఓసి రోడ్ నుండి కళాశాల ప్రాంగణం వరకు సీసీ రోడ్ కొరకు పంచాయతీ రాజ్ ఇంజనీర్ శాఖ అధికారులు కొలతలు వేసి ఎస్టిమేట్ వెయ్యాలని తెలిపారు.

కళాశాల ప్రాంగణం మొత్తం చెట్ల పొదలు తొలగించి శుభ్రం చేయించాలని డిపిఓ కి ఫోన్ ద్వారా తెలిపారు. హుస్నాబాద్ పట్టణం నుండి కళాశాల వరకు ఉదయం, సాయంత్ర వేళల్లో బస్సు సౌకర్యం కల్పిస్తానని అడ్మిషన్ పొందిన విద్యార్థులకు చదువు, మౌలిక వసతులు విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, ప్రిన్సిపల్ శ్రీదేవి, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -