Thursday, August 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లయన్స్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

లయన్స్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూర్
లైన్స్ క్లబ్ నూతన మండల కమిటీని మంగళవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ బుడిగె శ్రీనివాసులు, జిల్లా గ్యాట్ లీడర్ ఎర్ర శంభు లింగారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

క్లబ్ అధ్యక్షునిగా మండలంలోని ఈదులూరు గ్రామానికి చెందిన చిక్కు శేఖర్, కార్యదర్శిగా కట్టంగూరుకు చెందిన గుడిపాటి శివప్రసాద్, ట్రెజరర్ పి. రాములు, ఉపాధ్యాక్షులుగా రెడ్డిపల్లి సాగర్, కల్లూరి వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీగా బసవోజు వినోద్ కుమార్, జీఎస్టీగా ఆకవరపు బ్రహ్మచారి, జీఎంటీగా కక్కిరేణి నవీన్, జీఈటీగా తవిడబోయిన నర్సింహ్మ, ఎల్సీఐ బొల్లోజు వెంకటాచారి, ప్రచారకర్తగా చెరుకు శ్రీనివాస్, గౌరవ సలహాదారునిగా పున్న సుందరయ్య ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శేఖర్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ను మండలంలో బలోపేతం చేసి, సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా డీసి మెంబర్ డెంకెల సత్యనారాయ అంజిరెడ్డి, నకిరేకంటి శంకర్, జిల్లా ఉపేందర్, కమిటి సభ్యులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -