నవతెలంగాణ – కట్టంగూర్
ఆశా వర్కర్లకు జాబ్ చార్ట్ ను ప్రకటించి, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా నాయకులు పెంజర్ల సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రం లో తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) మండల మహాసభ మండల అధ్యక్షురాలు చౌగోని ధనలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆరోగ్య కేంద్రాలలో టార్గెట్ల పేరుతో ఆశా లను వేధించొద్దని కోరారు.
ఆరోగ్య మహిళ రోజు ఆశలకు ప్రయాణ ఖర్చులు లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.ఈ మహాసభలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పొన్నా అంజయ్య, తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తవీటి వెంకటమ్మ, సీఐటీయూ మండల కన్వీనర్ పొడిచేటి సులోచన, శ్రామిక మహిళా మండల కన్వీనర్ చెరుకు జానకి,యూనియన్ కట్టంగూరు మండల ప్రధాన కార్యదర్శి భూపతి రేణుక పాల్గొన్నారు.
ఆశాలకు జాబ్ చార్ట్ ప్రకటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES