- Advertisement -
మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నవతెలంగాణ దినపత్రిక ప్రజా చైతన్యానికి కరదీపిక అని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ అన్నారు. పత్రిక పదో వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి, పాఠకులకు ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రజా ఉద్యమాలకు మీడియాలో స్పేస్ తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో నవతెలంగాణ లాంటి పత్రికలకు కీలక ప్రాధాన్యత ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు సంబంధించిన రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను విశ్లేషించి అందిస్తోందని అభిప్రాయపడ్డారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ మరింత ముందుకు పోవాలని ఆకాంక్షించారు.
- Advertisement -