Wednesday, August 6, 2025
E-PAPER
Homeరంగారెడ్డిబావిలో దూకిన భార్య

బావిలో దూకిన భార్య

- Advertisement -

ఆమెను కాపాడబోయి భర్త, ఆమె చెల్లి మృతి
భార్యను కాపాడిన డ్రైవర్‌
వికారాబాద్‌ జిల్లాలో విషాదం
నవతెలంగాణ-మోమిన్‌పేట్‌

వికారాబాద్‌ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా భార్య బావిలో దూకింది. ఆమెను కాపాడబోయి భర్త, ఆమె చెల్లి ఇద్దరూ బావిలో దూకడంతో వీరిద్దరూ మృతి చెందారు. భార్యను డ్రైవర్‌ కాపాడారు. ఈ ఘటన మోమిన్‌పేట్‌ మండల పరిధిలోని చీమలదరి గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లికి చెందిన మాసయ్య(60), అలివేలు దంపతులతోపాటు అతని మరదలు నాగమణి(50) మోమిన్‌పేటకు వలస వచ్చారు. చీమలదరి గ్రామ సమీపంలోని పూజిత వెంచర్‌లో మూడు నెలల కిందట పనిలో చేరారు. ప్రతిరోజూ వెంచర్‌లో పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. సోమవారం రాత్రి మాసయ్య, అలివేలు గొడవ పడ్డారు. క్షణికావేశంలో అలివేలు గ్రామ సమీపంలోని అశోక్‌కు చెందిన బావిలో దూకింది. గమనించిన మాసయ్య ఆమెను కాపాడేందుకు బావిలో దూకాడు. వీరిని కాపాడేందుకు నాగమణి కూడా బావిలో దూకింది. అది గమనించిన వెంచర్‌ కాంట్రాక్టర్‌, డ్రైవర్‌ ప్రసాద్‌ వెంటనే బావి దగ్గరకు వెళ్లి ముగ్గురినీ రక్షించే ప్రయత్నం చేశారు. మాసయ్య, నాగమణి నీటిలో మునిగి మృతిచెందారు. అలివేలును రక్షించారు. అలివేలును చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ అరవింద్‌ పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మాసయ్య-అలివేలు దంపతులకు కొడుకు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -