ఆన్‌లైన్ రెంటల్ రెఫరల్ స్కామ్‌తో బూరిడీ
యువకుడికి రూ.35లకుపైగా కుచ్చుటోపీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
రోజుకో తీరులో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరస్థులు సరికొత్త మోసాలకు తెరలేపారు. ‘ఆన్‌లైన్ రెంటల్ రెఫరల్’ పేరుతో నగర యువకుడి నుంచి రూ.35,26,677 దండుకున్నారు. ఇందుకు సంబంధించి సైబర్‌క్రైమ్ ఏసీపీ శివమారుతీ మంగళవారం వివరాలు వెల్లడించారు. ముషీరాబాద్‌కు చెందిన ఓ యువకునికి వాట్సప్‌లో మెసేజ్ వచ్చింది. దానికి స్పందించిన యువకునికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. తాము కేరళకు చెందిన నికితా జీవన్, శివ ప్రకాష్‌గా పరిచయం చేసుకున్నారు. ‘తీవఅ్/ర్‌వaసyశ్రీవaరవ.అవ్- ఫ్లాట్‌ఫామ్‌లో పనిచేస్తే సులువుగా డబ్బులు సంపాదించొచ్చని నమ్మించారు. మీరు చేయాల్సిందల్లా స్థానికంగా ఉన్న అద్దె ఇండ్లు, దుకాణాలు, ఖాళీ స్థలాల జాబితాను మాకు ఆన్‌లైన్‌లో పోస్టు చేస్తే సరిపోతుందని, దానికి జీతంతోపాటు కమీషన్ డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. మీరు ఉద్యోగంలో చేరాలంటే ముందుగా రూ.10వేలు డిపాజిట్ చేస్తే ఆదాయంతోపాటు బోనస్, లాభాలు వస్తాయని నమ్మించారు. వారి మాటలు నమ్మిన యువకుడు రూ.10వేలు డిపాజిట్ చేశాడు. ప్రతిఫలంగా వారు రూ.10,748ను పంపించారు. ఉద్యోగం బాగుందని నమ్మిన బాధితుడు వారు చెప్పిన విధంగా మళ్లీ రూ.31,259 పంపించాడు. దానికి సైబర్ నేరస్థులు అనుకున్న ప్రకారం డబ్బులను తిరిగి పంపించారు. దాంతో మరింత నమ్మకం కుదరడంతో బాధితుడు వారితో లావాదేవీలు సాగించాడు. అలా మొత్తం రూ.35,26,677 డిపాజిట్ చేశాడు. దానికి వచ్చిన లాభాలను తీసుకునేందుకు ప్రయత్నిస్తే డబ్బులు విత్‌డ్రా కాలేదు. దాంతో సైబర్ నేరస్థులను సంప్రదిస్తే మరో రూ.12లక్షలు డిపాజిట్ చేస్తే మొత్తం డబ్బులు తీసుకోవచ్చని నమ్మించారు. దాంతో అనుమానం వచ్చిన బాధితుడు ఆరా తీసి మోసపోయినట్టు గుర్తించాడు. ఈ క్రమంలో సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు ఏసీపీ తెలిపారు.
సైబర్ నేరస్థుల సరికొత్త మోసాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES