Wednesday, August 6, 2025
E-PAPER
Homeజాతీయంముగిసిన శిబూ సోరెన్‌ అంత్యక్రియలు

ముగిసిన శిబూ సోరెన్‌ అంత్యక్రియలు

- Advertisement -

రాహుల్‌గాంధీ, ఖర్గే హాజరు
రాంచీ :
జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎంఎ) సహ వ్యవస్థాపకులు శిబూ సోరెన్‌ అంత్యక్రియలను మంగళవారం పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. రారుగఢ్‌లోని సోరెన్‌ పూర్వీకుల గ్రామం నెమ్రాలో ఈ అంత్యక్రియలు జరిగాయి. కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ఈ అంత్యక్రియల కార్యక్రమాన్ని సోరెన్‌ పెద్ద కుమారుడు, ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ నిర్వహించారు. అంత్యక్రియలు సందర్భంగా నెమ్రా గ్రామానికి రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. ‘దిషోమ్‌ గురు’గా అభిమానులు, మద్దతుదారులు పిలుచుకునే శిబూ సోరెన్‌ సోమవారం ఢిల్లీలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. శిబూ సోరెన్‌ భౌతిక కాయాన్ని రాంచీకి తరలించారు. ప్రజలు అంతిమ నివాళిలర్పించడం కోసం సోరెన్‌ భౌతిక కాయాన్ని జార్ఖండ్‌ అసెంబ్లీ ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి కొన్ని గంటలపాటు వుంచారు. సోరెన్‌ భౌతికకాయానికి గవర్నర్‌ సంతోష్‌ గంగ్వార్‌, స్పీకర్‌ రవీంద్రనాథ్‌ మహతో, ఇతర ప్రముఖులు నివాళర్పించారు. తరువాత నెమ్రాకు అంతిమయాత్రగా తీసుకుని వెళ్లారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -