Wednesday, August 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసెక్యూరిటీగార్డులకు

సెక్యూరిటీగార్డులకు

- Advertisement -

కనీస వేతనమివ్వాలి
పీఎఫ్‌ సరిగ్గా ఇవ్వని ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి
తెలంగాణ వ్యవసాయ మార్కెట్‌ కమిటీల సెక్యూరిటీ గార్డ్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటల సోమన్న
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులను స్కిల్డ్‌ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలనీ, పీఎఫ్‌ సరిగా అమలు చేయని థర్డ్‌ పార్టీ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ మార్కెట్‌ కమిటీల సెక్యూరిటీ గార్డ్స్‌ యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటల సోమన్న డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల సాంబయ్య అధ్యక్షతన యూనియన్‌ సమావేశం జరిగింది. అందులో సోమన్న మాట్లాడుతూ…మార్కెట్‌లలో పేరుకే సెక్యూరిటీ గార్డు విధులనీ, వారితో వేలం పాటలు నిర్వహించడం, క్లరికల్‌ పనులు చేయించడం, చెక్‌పోస్టుల్లో రవాణా వాహనాలను ఆపి తనిఖీలు చేయించడం, ఆన్‌లైన్‌ ద్వారా రశీదులు జారీ చేయించడం, మార్కెట్‌ ఫీజు వసూలు చేయించడం వంటి పనులు అప్పగిస్తున్నారని చెప్పారు. ఇలా అన్ని పనులు చేయించి కనీస వేతనం ఇవ్వకపోవడం దారుణమన్నారు. సెక్యూరిటీ గార్డులకు వేతనాలను ఏజెన్సీల ద్వారా కాకుండా మార్కెట్‌ కమిటీల ద్వారానే ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వారికి బీమా చేయించాలనీ, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. 61 ఏండ్లు దాటిన సెక్యూరిటీ గార్డులకు కుటుంబ పోషణార్థం రూ.5 లక్షలను మార్కెట్‌ కమిటీల నుంచి ఇప్పించాలని విన్నవించారు. సమావేశంలో ఆ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బలి సదయ్య, రాష్ట్ర నాయకులు జి.వెంకటనారాయణ, బి.వెంకట్‌, ఎమ్‌డీ.యాకూబ్‌, ఎ.సోమయ్య, సారయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -