Wednesday, August 6, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్పంద్రాగస్టు తర్వాత అసెంబ్లీ సమావేశాలు!

పంద్రాగస్టు తర్వాత అసెంబ్లీ సమావేశాలు!

- Advertisement -

– మాగంటి గోపినాథ్‌కు సంతాపం
– ‘కాళేశ్వరం’ నివేదికపై చర్చ, చర్యలే ప్రధాన చర్చనీయాంశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా వర్షాకాల సమావేశాలను నిర్వహించాల్సి ఉంది. పంద్రాగస్టు తర్వాత ఎప్పుడైనా అసెంబ్లీ, మండలి భేటి జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వంలో సమాలోచనలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభాపతి జి ప్రసాద్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, అసెంబ్లీ కార్యదర్శి సిహెచ్‌.నరసింహచార్యులు మధ్య అసెంబ్లీ సమావేశాల విషయంలో చర్చలు సాగుతున్నట్టు తెలిసింది. వర్షాకాల సమావేశాలకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు, భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించి మండలి చైర్మెన్‌, అసెంబ్లీ స్పీకర్‌, కార్యదర్శి తరచూ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోలీసు అధికారులతోనూ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఇదిలావుండగా జూబ్లీహిల్స్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ ఇటీవల మరణించిన నేపథ్యంలో సంతాప తీర్మానం పెట్టనున్నారు. తొలి రోజు సంతాపం తర్వాత సభ వాయిదా పడనుంది. అనంతరం ప్రధానంగా కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌ ఇచ్చిన నివేదికను అసెంబ్లీ, మండలిలో చర్చకు పెట్టాలని సర్కారు భావిస్తున్నది.
పంద్రాగస్టు తర్వాత జరిగే ఈ సమావేశాలు మొత్తం వారం రోజులలోపే ఉంటాయని సమాచారం. ఈనెల మూడో వారంలో అసెంబ్లీ భేటీ ఉండొచ్చని శాసనసభవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మూడు నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. ఈనెల 18న సమావేశాలు ప్రారంభించనున్నట్టు తెలిసింది. సభా సలహామండలి(బీఏసీ) నిర్ణయం మేరకు సభ ఎన్నిరోజులు నడపాలనే విషయమై స్పష్టత రానుంది. రెండు, మూడు రోజుల్లో ఈ విషయం తేలనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -