- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ( Mid-day meal workers ) పరిష్కరించాలని కోరుతూ నేడు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ధర్నాను జరగకుండా అడ్డుకోవాలని ఎక్కడిక్కడ అరెస్టు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమను హౌస్ అరెస్టు చేశారు. ఇంట్లో నిర్భంధించి బయట తాళం వేశారు. ఈ సందర్భంగా ఎస్వీ రమ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. ఏడు నెలలుగా కోడిగుడ్ల బిల్లులు, వంట బిల్లులు చెల్లించడం లేదని ఆరోపించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం చేయమన్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులను అరెస్టు చేయటమేంటి? అని ఆమె ప్రశ్నించారు.
- Advertisement -