నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ ప్రాంగణంలో ఇండియా బ్లాక్ కూటమి సభ్యులు ఆందోళన చేపట్టారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో బీహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ( SIR)పై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఎంపీలు ప్రియంకా గాంధీ వాద్రాతో పాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు. బ్యానర్లు చేతబూని ఈసీకి, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీలు మాట్లాడుతూ.. మేము ఉభయసభల్లో చర్చలు జరగాలనే కోరుతున్నాం, కానీ బీజేపీ మమ్మల్నీ చూసి భయపడుతూ..దూరంగా వెళ్తుందని విమర్శించారు.
ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై చర్చ నిర్వహించడానికి బుధవారం రాజ్యసభలో సస్పెన్షన్ బిజినెస్ నోటీసు ఇచ్చింది. అదనంగా, కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ బుధవారం బీహార్‌లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సమయంలో ఓటర్ల జాబితాలలో పెద్ద ఎత్తున తొలగింపులు అవకతవకలపై అత్యవసర చర్చ కోరుతూ లోక్‌సభలో వాయిదా తీర్మాన నోటీసును ప్రవేశపెట్టారు.