Wednesday, August 6, 2025
E-PAPER
Homeకరీంనగర్జయశంకర్ సార్ గొప్ప పోరాట యోధుడు

జయశంకర్ సార్ గొప్ప పోరాట యోధుడు

- Advertisement -

– తెలంగాణ శ్వాసగా, ధ్యాసగా లక్ష్యంగా జీవించిన మహానీయుడు
– ఘనంగా నివాళులర్పించిన వెలిచాల రాజేందర్ రావు
నవతెలంగాణ – కరీంనగర్

తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ ను ఘనంగా స్మరించుకుంటూ బుధవారం వెలిచాల ప్రజా కార్యాలయంలో ఆయన జయంతిని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు జయశంకర్ సార్ చిత్రపటానికి పుష్పాంజలులు అర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ “జయశంకర్ సార్ ఒక గొప్ప పోరాటయోధుడు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన తన జీవితాన్నే అంకితం చేశారు. తెలంగాణ ప్రజల శ్వాసగా, ధ్యాసగా లక్ష్యంగా జీవించిన మహానీయుడు. కోట్లాదిమంది హృదయాల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన నాయకుడు” అని ప్రశంసించారు. జయశంకర్ సార్ ఆశయాలే ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి పునాది అని, స్వరాష్ట్ర కలల జెండాను ఎప్పటికీ వదిలిపెట్టని మహాత్ముడని అన్నారు. తన తండ్రి జగపతిరావుతో సార్ కు ఆత్మీయత, అనుబంధం ఉండేదని, అనేకసార్లు తమ ఇంటికి వచ్చేవారని గుర్తుచేశారు.

ప్రతి ఒక్కరికి ఆయన మార్గదర్శకంగా నిలిచారని అన్నారు. ఆయన ఆశయాల సాధన దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు నేతికుంట యాదయ్య, గంట కళ్యాణి శ్రీనివాస్, ఆకుల నర్మదా నర్సన్న, కోటగిరి భూమా గౌడ్, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, తాండ్ర శంకర్, అనంతల రమేష్ పటేల్, గుమ్మడి రాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -