Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీల రిజర్వేషన్ కోసం ఢిల్లీలో గర్జించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 

బీసీల రిజర్వేషన్ కోసం ఢిల్లీలో గర్జించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు 
మతోన్మాద బీజేపీ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి నొప్పి ఏమిటని  ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గర్జించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. బీసీలకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసి, గవర్నర్ ఆమోదం పొంది కేంద్రానికి పంపితే, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అని, మతం ఆధారంగా చేస్తున్న పునాదులు కదులుతాయని ప్రధాని మోడీకి భయం పట్టుకుందని అన్నారు. అందుకే 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి జంకుతున్నాడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన బీసీ బిడ్డలను చూసైనా బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్న మోడీ కళ్ళు తెరవాలని హితవు పలికారు.

భావి ప్రధాని రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మండుటెండలు, మంచు కొండలు లెక్కచేయకుండా భారత్ జోడో యాత్ర చేసి, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో బీసీల రిజర్వేషన్ సమస్య తక్షణ పరిష్కారం కావాల్సిన అవసరం ఉందని గుర్తించారు. మొట్టమొదటగా దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో బీసీల కోసం 42 శాతం రిజర్వేషన్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రెడ్డి బిడ్డ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల కోసం ఏ మాత్రం సంకోచించకుండా 42 శాతం బీసీలకు రిజర్వేషన్ చేసి అసెంబ్లీలో గవర్నర్ తో ఆమోదం పొంది, కేంద్ర ప్రభుత్వానికి పంపించిన ఘనత దక్కిందన్నారు. ఎన్నో ఏళ్లుగా మేం ఎంతో మాకు అంత అని బీసీలు ఉద్యమిస్తున్నారని, 42 శాతం రిజర్వేషన్ వస్తే విద్యా ఉపాధి స్థానిక సంస్థల పదవులలో బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 56.7% గా బీసీలు ఉన్నారని, 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే తెలంగాణలో మద్దతు తెలిపి బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వచ్చి ప్రధాని చెవిలో వద్దని చెబుతూ.. మోకాలడ్డుతున్నారని ఆరోపించారు.

42 శాతం లో ముస్లిం ఉంటే రిజర్వేషన్ ఇయ్యరట బిజెపి వాళ్లు ముస్లింలు ఈ దేశ పౌరులకు కాదా.. వారికి జీవించే హక్కు లేదా.. వారి ఓట్లతో గద్దెనెక్క లేదా అని ప్రశ్నించారు. మత రాజకీయాలతో ప్రజలను విడదీయాలని తీస్తే దేశానికే ప్రమాదం అన్నారు. మూడుసార్లు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రస్తుత ప్రధాని మోడీ స్వరాష్ట్రల్లో రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయని, తెలంగాణ బిజెపి ఎంపీలు చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు బిజెపి పార్టీ గెలుచుకుందని, ఆ పార్టీ నాయకులు చిత్తశుద్ధి ఉంటే బీసీల న్యాయమైన కోరికలకు మద్దతు తెలిపి 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఒక మాట ఢిల్లీకి వచ్చి ఒక మాట ఇప్పటికైనా మానుకోవాలని ఇతువు పలికారు.

హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు జైనులు సిక్కులు జైనులు అంటూ దేశాన్ని విడగొట్టి రాజకీయాలు వద్దన్నారు. మనమంతా భారతీయులం అన్న విషయం గుర్తు తెచ్చుకోవాలి అన్నారు. రాజ్యాంగాన్ని పొందుపరిచిన అంబేద్కర్ గాంధీ వల్లభాయ్ పటేల్ ఈ దేశం  భారతీయులదని అందరికీ సమాన హక్కులు ఉంటాయన్న విషయం రాజ్యాంగంలో పొందుపరిచారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు గల్లీలో కాదు వచ్చి ఢిల్లీలో పోరాటం చేస్తే బీసీలకు న్యయమైన 42 శాతం రిజర్వేషన్లు దమ్ము ధైర్యం ఉంటే బీసీలకు అన్యాయం చేస్తున్న బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీకి వచ్చి పోరాటం చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. బీసీ ప్రధాని చెప్పుకుంటాం మోడీ ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం పంపిన బీసీ బిల్లుకు ఆమోదం తెలుపాలని లేకుంటే ఢిల్లీ ప్రభుత్వంమెడలు వంచైనా హక్కులు సాధిస్తామన్నారు. ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే.. అంతం కాదు. తెలంగాణ రాష్ట్రం నలువైపుల నుండి వచ్చిన తెలంగాణ ప్రజలు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం ఆపకుండ ముందుకు సాగాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -