Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్

గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
స్వరాష్ట్ర సాధనలో జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ఆచార్య జయశంకర్ సార్ ని మండల ఎంపిడిఓ నల్లగొండ శ్రీనివాస్ అన్నారు. ప్రొపెసర్ జయశంకర్ సార్ 91వ జయంతిని పురస్కరించుకుని బుధవారం తాడిచర్ల మండల పరిషత్ కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు  తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయాలు,ఆలోచనలు నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు.ఈ కార్యక్రమంలో సూపర్ డెంట్ సత్యనారాయణ మూర్తి,పంచాయతీ కార్యదర్శులు,కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img