- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
తల్లిపాల వారోత్సవాలలో భాగంగా సామూహిక శ్రీమంతలు, అన్న ప్రసన్న కార్యక్రమం డిచ్ పల్లి మండలం లోని ధర్మారం బీ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు ఎడవెల్లి జ్యోతి సోమనాథ్ గర్భిణులకు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు. అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తలగించడంతో రోగనిరోధక శక్తి పెంచుతుందన్నారు. ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలు ఎంతో అవసరమని తల్లులకు వివరించారు. కార్యక్రమంలో గoడ్రు సునీత, గోరంట్ల మహిమ జ్యోతి తోపాటు తల్లులు , బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -