క్యూబాకు సంఘీభావంగా నిలబడదాం : పోస్టర్ ఆవిష్కరణలో టి. సాగర్ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
క్యూబాపై అమెరికా ఆంక్షలను సహించబోమని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ హెచ్చరించారు. క్యూబాకు సంఘీభావంగా నిలబడతామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో క్యూబాకు సంఘీభావంగా నిధులు సేకరించాలనే పోస్టర్‌ను ఆవిష్కరిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న క్యూబాకు ఆర్థికంగా మద్దతు ఇచ్చేందుకు ‘క్యూబా సాలిడారిటీ నిధి’ని సేకరించాలని పిలుపునిచ్చారు. అమెరికన్ సామ్రాజ్య వాదాన్ని ఎదిరించి, దేశ సార్వభౌమత్వం కోసం పోరాడుతున్న క్యూబాకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిధులను సేకరించాలనే ఏఐకేఎస్ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దగ్గర నుంచి నిధులు సేకరించాలని కోరారు. ఫిడేల్ క్యాస్ట్రో వందేండ్ల జయంతి సందర్భంగా ఆ నిధిని క్యూబా సాలిడారిటీ జాతీయ కమిటీకి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జంగారెడ్డి, అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ పాల్గొన్నారు.
అమెరికా ఆంక్షలను సహించం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES