Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంట్రంప్‌ సుంకాల బాంబులు

ట్రంప్‌ సుంకాల బాంబులు

- Advertisement -

భారత్‌పై పెనాల్టీగా మరో 25శాతం విధింపు
మొత్తం భారం 50 శాతానికి..
వాషింగ్టన్‌ :
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. ఇప్పటికే ప్రకటించిన 25 శాతం సుంకాలకు తోడు, పెనాల్టీ రూపంలో మరో 25 శాతం సుంకాలు విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తుండడం వల్లనే ఈ పెనాల్టీ విధిస్తున్నట్ల్టు స్పష్టం చేశారు. తాజా పెనాల్టీతో భారత్‌ నుంచి అమెరికాలోకి ప్రవేశించే వస్తువులపై విధించిన సుంకాలు 50 శాతానికి పెరిగాయి.
నేటి నుంచే అమలు…
ఇండియాపై అమెరికా విధించిన 25 శాతం సుంకాలు రేపటి (ఆగస్టు 7) నుంచే అమలు కానుండగా, తాజాగా విధించిన 25 శాతం పెనాల్టీ సుంకాలు 21 రోజుల్లో అమల్లోకి రానున్నట్టు శ్వేతసౌధం వెల్లడించింది.
వెనక్కు తగ్గట్లే..
భారత్‌పై విధించే సుంకాల విషయంలో సొంత పార్టీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నా ట్రంప్‌ ఏమాత్రం వెనక్కి తగడం లేదు. రష్యా నుంచి భారత్‌ కంటే చైనా చాలా ఎక్కువగా చమురు కొంటోంది. అయినప్పటికీ దానికి 90 రోజులు పాటు సుంకాల నుంచి విరామం ఇచ్చిన ట్రంప్‌, భారత్‌పై మాత్రం తన కఠిన వైఖరి కొనసాగిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్‌ ఉందన్నారు. అందుకే భారత్‌ను ట్రంప్‌ ‘టారిఫ్‌ కింగ్‌’గా అభివర్ణించారు. బ్రిక్స్‌ కూటమిలో భాగమై అమెరికాకు సవాల్‌ విసురుతోందని వ్యాఖ్యానించారు. రష్యా నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యాపారం చేస్తూ, ఉక్రెయిన్‌పై యుద్ధానికి నిధులు సమకూర్చే అన్ని దేశాలపై ఇలాంటి చర్యలే తీసుకుంటామని ట్రంప్‌ స్పష్టంచేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img