– వడ్డీ రేట్లు యథాతథం
– ట్రంప్ టారిఫ్‌లతో ఆర్బీఐ ఏకగ్రీవ నిర్ణయం
ముంబయి : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ దఫా సమీక్షలోనూ వడ్డీ రేట్లను తగ్గించ నుందని ఆశించిన రుణ గ్రహీత లకు నిరాశ మిగిలింది. కీలక వడ్డీ రేట్లకు సంబంధించిన రెపోరేటును యథా తథంగా 5.5 శాతంగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్రకటనలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆర్బీఐ గవర్నర్ సంజరు మల్హోత్రా ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సాగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ద్రవ్య పరపతి విధాన సమీక్షా జరిగింది. ఇందులోని నిర్ణయాలను బుధవారం మల్హోత్రా మీడియాకు వెల్లడించారు. రెపో రేటును యథాతథంగా 5.5 శాతం వద్దే ఉంచాలని ఎంపీసీ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లో కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించగా.. జూన్‌లో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. రుతుపవనాలు సమృద్ధిగా ఉండటంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 3.1 శాతానికి తగ్గే అవకాశం ఉందని సంజరు మల్హోత్రా పేర్కొన్నారు. భారత స్థూలదేశీయోత్పత్తి 6.5 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేశారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వృద్ధికి ఆటంకంగా మారుతున్నప్పటికీ.. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ముందుకెళ్తోందన్నారు.
రుణగ్రహీతలకు నిరాశే
- Advertisement -
- Advertisement -