Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంబెట్టింగ్‌ యాప్‌ కేసులో నటుడు విజయ్‌ దేవరకొండ విచారణ

బెట్టింగ్‌ యాప్‌ కేసులో నటుడు విజయ్‌ దేవరకొండ విచారణ

- Advertisement -

దాదాపు రెండు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్రంలో కలకలం రేపిన బెట్టింగ్‌ యాప్‌ కేసులో నటుడు విజయ్‌ దేవరకొండను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు బుధవారం విచారించారు. బెట్టింగ్‌ యాప్‌ కేసుకు సంబంధించి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటులు ప్రోత్సహిం చటం వంటి చర్యలకు పాల్పడి హవాలా ద్వారా భారీ మొత్తంలో డబ్బులను వెనకేసుకున్నారని ఈడీ దృష్టికి వచ్చింది. ఈ మేరకు ఇప్పటికే పలువురు నటులను ఈడీ విచారించింది. తాజాగా విజరుదేవరకొండకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంది. దీంతో ఉదయమే బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న విజరు దేవరకొండను దాదాపు రెండు గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. విచారణానంతరం వెలుపలికి వచ్చిన నటుడు మీడియాతో మాట్లాడుతూ.. బెట్టింగ్‌ యాప్‌లకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధమూ లేదనీ, స్పోర్ట్స్‌ యాప్‌లలో తన ఆసక్తిని చూపించానని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img