Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంచైనా పర్యటనకు ప్రధాని మోడీ

చైనా పర్యటనకు ప్రధాని మోడీ

- Advertisement -

షెడ్యూల్‌ ఖరారు..
‘గల్వాన్‌’ ఘటన తర్వాత తొలిసారి
న్యూఢిల్లీ :
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలో చైనాలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారైంది. తియాంజిన్‌ వేదికగా ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1 తేదీల్లో జరగనున్న షాంఘై సహకార సదస్సులో ఆయన పాల్గొననున్నారు. గల్వాన్‌ ఘటన తర్వాత ప్రధాని మోడీ చైనాలో పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతేడాది కజాన్‌లో జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో జిన్‌పింగ్‌తో మోడీ భేటీ అయిన విషయం తెలిసిందే. తొలిసారిగా 2015లో బీజింగ్‌కు వెళ్లిన భారత ప్రధాని.. ఇప్పటివరకు ఐదుసార్లు ఆ దేశంలో పర్యటించారు. 2019లో చివరిసారిగా చైనాలో పర్యటించారు. ఆ తర్వాత 2020లో లద్దాక్‌ సరిహద్దుల్లో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటి పునరుద్ధరించేందుకు సైనిక, దౌత్యాధికారుల మధ్య అనేక దఫాల్లో చర్చలు జరిగ్గా ఇటీవలే కొంత పురోగతి కనిపిస్తోంది.
మరోవైపు భారత్‌పై సుంకాలు విధించిన ట్రంప్‌.. రష్యాతో ముడిచమురు కొనుగోలును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని విధిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో రష్యా మాత్రం భారత్‌కు మద్దుతుగా నిలుస్తోంది. ఇదే సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోడీ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img