Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసైబర్‌ జాగరూకతపై రాష్ట్రంలో విస్తృత ప్రచారం చేశాం

సైబర్‌ జాగరూకతపై రాష్ట్రంలో విస్తృత ప్రచారం చేశాం

- Advertisement -

– సీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖా గోయెల్‌
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

సైబర్‌ నేరాలకు సంబంధించి విద్యార్థిలోకంలో విస్తృత ప్రచారం చేయటంతో పాటు వారిలో చైతన్యాన్ని పెంపొందించటానికి బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సైబర్‌ జాగరూకత కార్యక్రమాన్ని నిర్వహించామని సీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖా గోయెల్‌ తెలిపారు. దాదాపు 577 కాలేజీలు, స్కూళ్లలో ఈ ప్రచార కార్యక్రమం సాగిందని చెప్పారు. బ్యాంకు మోసాలు, వ్యక్తిగత లాటరీల మోసాలు, మొదలుకొని వివిధ రకాల సైబర్‌ నేరాలపై ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిపుణులు వివరించటం జరిగిందని ఆమె తెలిపారు. అలాగే సైబర్‌ నేరాలను అడ్డుకునే విషయమై వ్యాసరచన పోటీలనూ నిర్వహించామని అన్నారు. వివిధ పాఠశాలల్లో ప్రత్యేకంగా బోర్డులను ఏర్పాటు చేసి, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించే సమాచారాన్ని నిక్షిప్తం చేయటం జరిగిందని ఆమె తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img