– సీఎం రేవంత్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
చేనేత రంగానికి, నేతన్నల కుటుంబాలకు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు ముఖ్యమంత్రి శభాకాంక్షలు తెలిపారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నదో, అంతే ప్రాధాన్యత నేతన్నలకు ఇస్తున్నదని గుర్తు చేశారు. చేనేత కార్మికుల పాత బకాయిలను విడుదల చేయడంతో పాటు, లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలు మాఫీ చేయడం జరిగిందన్నారు. చేనేత కార్మికుల సమగ్రాభివద్ధికి తెలంగాణ చేనేత అభయ హస్తం పథకం, తెలంగాణ నేతన్న పొదుపు , నేతన్న బీమా, తెలంగాణ నేతన్నకు భరోసా వంటి వినూత్న కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్నదని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
చేనేత దినోత్సవం శుభాకాంక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES