- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలో ఉన్న అంగన్ వాడి కేంద్రాల్లో చిన్నారులు రాఖీ పండగ సంబరాలు గురువారం ముందస్తుగా నిర్వహించారు. చిన్నారులు ఒక్కరోకోక్కరూ రాఖీ కట్టుకొని,స్వీట్స్ తినిపించారు. రాఖి పండగ,అన్నచెల్లెళ్ళ అనుబంధాలపై అంగన్ వాడి టీచర్లు చిన్నారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్లు అన్నపూర్ణ, సోజన్య, భారతి,రమ, ఆయాలు,చిన్నారులు పాల్గొన్నారు.
- Advertisement -