ఇంటింటికి మొక్కల పంపిణీ
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మహిళలు మొక్కలను నాటి సంరక్షించడం తమ బాధ్యతగా భావించాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మహిళా సంఘాల సభ్యుల ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.మొక్కల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మహిళ సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి మూడు నుండి ఐదు మొక్కలను అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో చింతరాజ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఇంటిలో తప్పనిసరిగా కనీసం మూడు మొక్కలనైనా నాటాలన్నారు.
నాటిన మొక్కలను సంరక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇంటి ఆవరణలో మొక్కలను పెంచడం ద్వారా ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. పిల్లలను పెంచినట్టుగానే మొక్కల్ని కూడా నాటి పెంచాలన్నారు. ప్రస్తుతం మనం నాటుతున్న మొక్కలు భవిష్యత్తులో వృక్షాలై ఎందరికో ప్రాణవాయువును అందిస్తాయన్నారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగాజమున, ఫీల్డ్ అసిస్టెంట్ రమ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల బుచ్చి మల్లయ్య, సింగిరెడ్డి శేఖర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్, గ్రామ సమైక్యల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
మొక్కల సంరక్షణ తమ బాధ్యతగా భావించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES