నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో జరుగుతున్న సీసీరోడ్డు పనులను తక్షణమే ఆపాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం ఎంపీడీఓ శివ కుమార్ ను ఆదేశించారు. ఎడ్ బిడ్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.7లక్షలు సిసి రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే సిసి రోడ్డు నిర్మించుకుండా బిల్లును పంచాయతీ రాజ్ అధికారులు ఆన్లైన్ లో పొందుపరిచారు.
ఈ విషయం గురువారం మీడీయా ద్వారా బయటకు పొక్కింది. దీంతో సీసీరోడ్డు పనులను గుత్తేదారు గురువారం ప్రారంభించారు. అయితే వెంటనే పంచాయతీ రాజ్ అధికారులు పనులను ఆపివేశారు. దీంతో గుత్తేదారు సీసీరోడ్లు పనులను మళ్ళీ ప్రారంభించారు. ఈ విషయం కలెక్టర్ కు దృష్టికి వెళ్ళిన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఎంపీడీఓ హుటాహుటిన గ్రామానికి వెళ్లి గురువారం సాయంత్రం సీసీరోడ్డు పనులను నిలిపివేశారు. కలెక్టర్ ఆదేశాలతో సీసీరోడ్డు పనులను ఆపినట్లు ఎంపీడీఓ నవతెలంగాణకు తెలిపారు.
కలెక్టర్ ఆదేశాలతో ఆగిన సీసీరోడ్డు పనులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES