నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నలుగురు చేనేత కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథి రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి హాజీరై మాట్లాడుతూ నేతన్నలను కాపాడుకోవాలంటే వారు నేస్తున్న దుస్తులను ప్రతి ఒక్కరూ తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని, ప్రస్తుత సమాజంలో అందరం వారు నేసిన దుస్తువులనే వేసుకోవాలని, సమాజంలో నేతన్నలని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని అందులో భాగంగా నేత కార్మికులైన దాసరి నారాయణ, బండారి గంగాధర్, ఇప్పకాయల గంగారాం, బాల నర్సు లను సన్మానించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథి గా పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు చాట్ల రాజేశ్వర్, రోటరీ క్లబ్ అధ్యక్షులు శంకర్, చేనేత జిల్లా అధ్యక్షులు సబ్బాని ధర్మపురి, రోటరీ జనరల్ సెక్రెటరీ, రాష్ట్ర చేనేత ఐక్య వేదిక ఉపాధ్యక్షులు సబ్బని కృష్ణ హరి, జిల్లా కార్యదర్శి భుస వెంకట స్వామి, కార్యదర్శి శాప నర్సింలు, రోటరీ సభ్యులు కసప వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES