Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్10వ జాతీయ ఓబీసీ మహాసభలో జిల్లా నాయకులు

10వ జాతీయ ఓబీసీ మహాసభలో జిల్లా నాయకులు

- Advertisement -

బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు
నవతెలంగాణ –  కామారెడ్డి

గోవాలో జరుగుతున్న పదవ జాతీయ ఓబీసీ మహాసభలకు కామారెడ్డి జిల్లా నాయకులు తరలి వెళ్లి ఆ సభలో పాల్గొనడం జరుగుతుందని బీసీ విద్యార్థి సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గోవా రాష్ట్రంలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభకు జిల్లా నుండి పెద్ద ఎత్తున బీసీ నాయకులు  హాజరవడం జరిగిందన్నారు.

దేశంలో మొదటీ సారి మండల కమీషన్ సిఫార్సులైన ఓబీసీలకు ఉద్యోగ రంగంలో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ సింగ్ ప్రకటించిన ఆగస్ట్ 7 రోజున ప్రతీ సంవత్సరం దేశంలోని అన్ని ఉద్యమ శక్తులు ఈ మహాసభను పెద్ద ఎత్తున జరుపుకోవడం  జరుగుతుందని అన్నారు.  బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వంచే చట్టపరంగా అమలు చేసే వరకు ఉద్యమించి సాధించుకుంటామని తెలిపారు.చట్టసభల్లో బీసీ మహిళలకు ప్రత్యేక కోట ద్వారా బేషరతుగా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారామ్, మానిక్ రావ్ ఠాక్రే, కేంద్ర,రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా నుండి బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి నాగరాజ్ గౌడ్, ఉపాధ్యక్షులు అజయ్,గోవర్ధన్,శ్యామ్,దయాకర్,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img