Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కడుపులో నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత: డా. క్రిస్టినా

కడుపులో నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత: డా. క్రిస్టినా

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
సామాజిక ఆసుపత్రి డిచ్ పల్లిలో జాతీయ నులిపురుగు నివారణ కార్యక్రమం పై ఇందల్ వాయి, డిచ్ పల్లి మండలాల విద్యాధికారులు, అంగన్వాడీ టీచర్స్ కు, ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,సామాన్య శాస్ర ఉపాధ్యాయుల, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల  అధ్యాపకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్ వాయి వైద్యాధికారిని డాక్టర్ క్రిస్టినా పాల్గొని మాట్లాడుతూ ..

నులి పురుగుల నివారణకు భోజనానికి ముందు, మల మూత్ర విసర్జన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలని చేతులు కడిగే విధానం ను వివరించారు. కడుపులో నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత ఏర్పడుతుందని, ఆకలి మందగించి పౌష్టికాహారా లోపంతో బాధపడుతారని వివరించారు. విద్యార్థులల్లో చదువుపై శ్రద్ధ లోపిస్తుందని,పిల్లలు ఆరుబయట వట్టికాళ్ళతో ఆడుకొనుట, బహిరంగ ప్రదేశలలో మలవిసర్జన చేయుట వలన నులిపురుగులు సంక్రామించే అవకాశం ఉందని తెలిపారు. జాతీయ నులిపురుగు నివారణ కార్యక్రమం ఆగష్టు 11 న జరుగుతుందని ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ అల్ఫండజోలు మాత్రమే తీసుకోవాలని,1-19 సంవత్సరంలో వయసు గల పిల్లలందరూ తప్పనిసరిగా నులిపురుగు నివారణ మాత్రలు వేసుకోవాలని తెలిపారు.

1-2 సంవత్సరాల  వయసు గల పిల్లలందరూ సగం మాత్ర 200 ఎంజి అనగా అర్ధమాత్రను నలిపి వేయాలి,2-19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ కచ్చితంగా ఒక మాత్ర అనగా ఆల్బండజోలు మాత్ర 400 ఎంజి ని ఇవ్వాలి. ప్రతి అంగన్వాడి కేంద్రంలోనూ ప్రతి పాఠశాలలోనూ ప్రతి కళాశాలలోనూ 19 సంవత్సరాలు లోపు వయసు గల పిల్లలందరికీ కచ్చితంగా ఈ యొక్క మాత్రను అందరికీ కడుపునిండా భుజించిన తర్వాత మాత్రమే ఈ మాత్రను వేయాలి. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చినట్లయితే స్థానిక వైద్యాధికారికి గాని స్థానిక ఆరోగ్య కార్యకర్తకు గాని సమాచారం ఇవ్వాలని సూచించారు.మాప్ ఔట్ రౌండ్ 18 ఆగష్టు తేదీన ఉంటుందని,ఆ రోజున మిగిలిన పిల్లందరికి ఈ రోజున మాత్రలు వేయాలని తెలిపారు.కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై. శంకర్, డిచ్పల్లి విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి,ఇందల్వాయి విద్యాశాఖ అధికారి శ్రీధర్, ఎం. హెల్. హెచ్.పి లు, డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img