- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం దుబ్బాక మండల పరిధిలోని రాజక్కపేటలో అంగన్వాడీ కేంద్రం- 3 లో ఐసీడీఎస్ రామక్కపేట సెక్టర్ సూపర్వైజర్ స్వరూప ఆధ్వర్యంలో ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన, ప్రీస్కూల్ విద్యార్థుల జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం చిన్నారులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట పంచాయతీ కార్యదర్శి రవికుమార్, ఏఎన్ఎం శైలజ, అంగన్వాడీ టీచర్ చైతన్య, ఐకేపీ సీఏ లావణ్య పలువురు పాల్గొన్నారు.
- Advertisement -