పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు
నవతెలంగాణ – రామారెడ్డి
గ్రామంలో దోమల నివారణ చర్యలు చేపట్టాలని మద్దికుంట గ్రామ యువకులు పంచాయితీ కార్యదర్శి నరేష్ కు వినతి పత్రం అందజేశారు. గురువారం ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ… గ్రామంలో ముందస్తు చర్యగా డ్రైనేజీలను శుభ్రపరుస్తూ, దోమల నివారణ మందులను పిచికారి చేయాలని పంచాయతీ కార్యదర్శిని కోరినట్లు తెలిపారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు ముందుగానే రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. విద్యార్థులంతా సోదర, సోదరీ భావంతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ముత్యాలరాజు, బొమ్మిడి సతీష్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, భానుచందర్, మైైసిి సురేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలో దోమల నివారణ చేపట్టాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES