Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రం అందజేత 

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రం అందజేత 

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి  
మండలంలోని ఉప్లూర్ లో గురువారం ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం స్థలం వద్దనే స్థానిక కాంగ్రెస్ నాయకులు మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీల ప్రకారం బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి  ముత్యాల సునీల్ కుమార్ కృషితో అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తప్పనిసరిగా సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంజూరుకు కృషి చేసిన సునీల్ కుమార్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుంకరి విజయ్ కుమార్, ఏనేడ్ల గంగారెడ్డి, నాయకులు శేఖర్, ఆంజనేయులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img