Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుశ్రీ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ కు బెస్ట్ అవార్డు

శ్రీ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ కు బెస్ట్ అవార్డు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదగిరిగుట్ట మండలంలోని యాదగిరి పల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ డీలర్ కోల వెంకటేష్ గౌడ్ కష్టమర్లకు నాణ్యమైన పెట్రోల్ డీజిల్ అందజేసినందుకుగాను ఉత్తమ ఫిల్లింగ్ స్టేషన్ అవార్డును ఆయన తరపున అరె ప్రవీణ్ అందుకున్నారు. కాగా గురువారం వరంగల్ రీజియన్ పరిధిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డీలర్ల సమావేశం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని సన్నిధి హోటల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫీసర్స్ సుపత్, నరేష్, ఊర్మిళ ప్రణయ్ లు హాజరై, మాట్లాడారు. 

శ్రీ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్కు ఉత్తమ ఫీలింగ్ స్టేషన్ అవార్డు రావడం పట్ల యాదగిరిగుట్ట, యాదిరిపల్లి వాసులు ఆనందం వ్యక్తం చేస్తూ,  పలువురు అభినందనలు తెలిపారు. అనది కాలంలోనే శ్రీ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ కు ఉత్తమ ఫిల్లింగ్ స్టేషన్ అవార్డు రావడానికి సహకరించిన అధికారులకు,  కస్టమర్ దేవుళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img