Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంచేపల వేటకు వెళ్ళి వ్యక్తి మృతి

చేపల వేటకు వెళ్ళి వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
చెరువులో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి నీటిలో పడి మృతి చెందిన ఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని కేశప్పగూడెం కి చెందిన సోడెం మహేష్(29),తన సోదరుడు ముత్యాల రావు తో పాటు మరికొంత మంది గ్రామస్తులు కలిసి ఊట్లపల్లి సమీపంలో గల వెంకమ్మ చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే మహేష్ చెరువులో తన వద్ద ఉన్న వలను నీళ్లలో వేసేందుకు వెళ్లాడు.కాగా చెరువు దిగి కొద్ది దూరం వెళ్లి వల విసిరే సమయంలో అదుపుతప్పి చెరువులో పడిపోయాడు.

ఈత రాకపోవడంతో నీటిలో మునుగు తూనే గట్టిగా కేకలు వేయడంతో తమ్ముడు ముత్యాల రావుతోపాటు గ్రామస్తులు గమనించి కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే నీళ్లలో మునిగిపోవడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు అవివాహితుడు, తమ్ముడితో కలిసి ఉంటున్నాడు.  ఈ ఘటనపై మృతుడి తమ్ముడు ముత్యాల రావు చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టీ.యయాతి రాజు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img