Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్పిల్లల ఆరోగ్యం మనందరి భాధ్యత: డా. శ్రవణ్ కుమార్

పిల్లల ఆరోగ్యం మనందరి భాధ్యత: డా. శ్రవణ్ కుమార్

- Advertisement -

నవతెలంగాణ – శంకరపట్నం
పిల్లల ఆరోగ్యం మనందరి బాధ్యత అని శంకరపట్నం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రావణ్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఘనంగా నిర్వహించిన జాతీయ నులిపురుగుల దినోత్సవంలో ఆయన ఈ సందేశాన్ని ఇచ్చారు.డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, నులిపురుగుల సమస్యను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. నులిపురుగుల వల్ల పిల్లలు అనారోగ్యం పాలవడమే కాకుండా, వారి పెరుగుదల మరియు అభివృద్ధి కూడా కుంటుపడుతుందని తెలిపారు. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్ర ఆల్బెండజోల్ ను ఉచితంగా అందిస్తోందని చెప్పారు.

ఈ మాత్రలను అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో పంపిణీ చేయనున్నారు. “1 నుండి 2 సంవత్సరాల పిల్లలకు సగం మాత్ర, ఆ పైబడిన వారికి పూర్తి మాత్ర ఇవ్వాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా ఈ మాత్ర వేయించాలి,” అని ఆయన కోరారు. ఈ నెల 11 లేదా 18 తేదీలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని డాక్టర్ శ్రావణ్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమానికి మండల తాసిల్దార్ సురేఖ, ఎంపీడీవో కృష్ణ ప్రసాద్, ఎంఈఓ లక్ష్మీనారాయణ, సిడిపిఓ శ్రీమతి, ఐసిడిఎస్ సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్స్, ఎమ్ఎల్ఎస్ డాక్టర్స్ మరియు ఏఎన్ఎంలు  హాజరయ్యారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img