Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్చేతిరాతే విద్యార్థుల భవితకు చేయూత

చేతిరాతే విద్యార్థుల భవితకు చేయూత

- Advertisement -

నవతెలంగాణ- రాయపోల్ 
చేతిరాతనే విద్యార్భథుల భవితకు చేయూతనిస్తుందని అందమైన చేతిరాత విద్యార్థుల సృజనాత్మకతకు నిదర్శనమని చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ అన్నారు. గురువారం రాయపోల్ మండలం రామారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందమైన చేతిరాత నేర్పించడం పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యార్థి దశలో అందంగా రాయడం నేర్పించడం ఎంతో అవసరమన్నారు. అందమైన చేతిరాత మనిషి మనసును అదుపులో ఉంచుతుందని నిర్మాణాత్మకంగా ఆలోచింపజేస్తుందన్నారు.

విద్యార్థులకు స్వయం క్రమశిక్షణను పెంపొందింపచేస్తుంది. మనిషి అంతసందర్భానికి మనోజ్ఞమైన భాష్యం. అది పాఠకుల హృదయాలు రంజింప చేస్తే సువర్ణ రసఝరీ అని ఒక కవి అన్నట్లు ఉపాధ్యాయులు అక్షర రమ్యతను చేజెక్కించుకొని విద్యార్థుల గుండె గరిసలో ఆణిముత్యాల సంపదను నింపి నిత్య విద్యకృషివలుడు కావాలన్నారు. కోరిక శ్రద్ధ ఆసక్తి పట్టుదల ఉండే ఆచార్యులు దేనినైనా సాధించవచ్చన్నారు. తెలుగు, హిందీ,ఆంగ్లం మూడు భాషలలో అందమైన చేతిరాతను విద్యార్థులకు నేర్పించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజగోపాల్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ దండియాల విమల, ఉపాధ్యాయులు రాజమహేంద్ర రెడ్డి, శ్రీరాములు, వేణుగోపాల్ రెడ్డి, యాదగిరి, జ్యోతిలక్ష్మి, సంపత్, చందు, రవి, భాస్కర్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img