– పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్‌రంజన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సినిమా షూటింగ్‌లకు తెలంగాణ అనుకూల ప్రదేశమని పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్‌రంజన్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తాజ్‌క్రిష్ణలో సినిమా, పర్యాటక రంగాల అభివృద్థిపై సినీ ప్రముఖులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు అనువైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయనీ, వాటిని తెలుగు సినిమా రంగం వినియోగించుకునేలా ప్రత్యేక పాలసీని తీసుకొస్తామని చెప్పారు. సింగిల్ విండో వ్యవస్థలో అన్ని సినిమా షూటింగ్ అవసరాల కోసం ”ఫిల్మ్ ఇన్ తెలంగాణ” పోర్టల్‌ను ”వన్ స్టాప్ షాప్”గా అభివృద్ధి చేసి కార్యాచరణ ప్రణాళికను ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27 నాటికి ప్రకటించనున్నట్టు తెలిపారు. స్థానికంగా సినిమాలు నిర్మించడం వల్ల బడ్జెట్‌లో సినిమాలు పూర్తి కావడంతో పాటు సమయం కూడా కలిసి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి స్నేహజ, తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ వల్సూరు క్రాంతి, సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ ప్రియాంక, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ దిల్ రాజు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఫిల్మ్ స్టూడియోలు, సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్, ట్రావెల్, హాస్పిటాలిటీ, ఏవియేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగాలకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
సినిమా షూటింగ్‌లకు తెలంగాణ అనుకూలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES