Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంతెలంగాణలో కమీషన్ల పాలన : ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌

తెలంగాణలో కమీషన్ల పాలన : ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌

- Advertisement -

నవతెలంగాణ – బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు పాలన కమీషన్లమయంగా మారిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేషన్‌ కార్డు, ఇందిరమ్మ కార్డు, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు, ఇలా ఏ పనికైనా కమీషన్లు ముట్టనిదే అడుగు ముందుకు పడట్లేదని విమర్శించారు. బెయిల్‌మీద ఉండి సీఎం అయిన రేవంత్‌రెడ్డి తన పదవికి కాపాడుకునేందుకు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌లది క్విడ్‌ ప్రోకో రాజకీయమని ఆరోపించారు. ప్రజలు రేవంత్‌రెడ్డిని ఇంటికి పంపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img