– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
పేద ప్రజల సమస్యలే తన సమస్యలుగా భావించి నిరంతరం ప్రజల కోసం పనిచేసిన రాసాల వెంకటేష్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం మాజీ సర్పంచ్ రాసాల నిర్మల భర్త, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు, రైతు సంఘం డివిజన్ కార్యదర్శి రాసాల వెంకటేష్ బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ బుధవారం రాత్రి సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. బస్వాపురాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన ఘనత సీపీఐ(ఎం)కే దక్కిందని, గ్రామ అభివద్ధిలో వెంకటేష్ పాత్ర కీలకమని చెప్పారు. కూలి, రైతు, వ్యవసాయ, మహిళా హక్కుల కోసం జరిగే పోరాటాలలో ముందుండి నడిపించేవారని గుర్తు చేశారు. బస్వాపురం రిజర్వాయర్ సాధనలో, భూములు కోల్పోతున్న ప్రజలకు భూములు ఇప్పించడంలో.. వారి పక్షాన నిలబడి పోరాటాలు చేయడంలో వెంకటేష్ పాత్ర కీలకమని వివరించారు. అదేవిధంగా వెంకటేష్ మృతదేహాన్ని గురువారం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంకటేష్ మరణం సీపీఐ(ఎం), ప్రజాసంఘాలకు, బసవపురం గ్రామ శాఖకు తీరని లోట న్నారు. వెంకటేష్‌కు నివాళులర్పించిన వారిలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్, జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, సిర్పంగి స్వామి, గడ్డం వెంకటేష్, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, నాయకులు ఎదునూరి మల్లేష్, కొండ అశోక్, అన్నంపట్ల కృష్ణ తదితరులు ఉన్నారు.
వెంకటేష్ ఆశయ సాధనకు కృషి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES