Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసినీకార్మికుల సమ్మెకుసీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు

సినీకార్మికుల సమ్మెకుసీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు

- Advertisement -

ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలి : జాన్‌వెస్లీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సమస్యల పరిష్కారం కోసం ఈనెల నాలుగో తేదీ నుంచి తెలుగు చలనచిత్ర కార్మికులు చేస్తున్న సమ్మెకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 24 క్రాఫ్ట్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు సంబంధించిన వేతనాల పెంపు విష యంలో చలనచిత్ర రంగంలోని నిర్మా తలు మొండి పట్టుదలకు పోకుండా వారితో చర్చలు జరపాలని కోరారు. వారి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా ఎప్ప టికప్పుడు వేతనాలను పెంచాలంటూ కార్మికులు కోరుతున్నారని తెలిపారు. 2022లో ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. గత మూడేండ్ల నుంచి వేతనాలను పెంచలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా గతంలోనే వేతన ఒప్పందం సందర్భంగా 30 శాతం పెంపుదలకు హామీనిచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని కార్మికులు డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. అసంఘటిత రంగంగా ఉన్న కార్మికులు ఏరోజు కారోజు పని దొరికితే గానీ కుటుంబాలు గడవని వారే ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. భారీ బడ్జెట్‌ ఉన్న సినిమాలు రూ.వందల కోట్ల మార్కెట్‌ చేస్తున్న సందర్భంలో కార్మికుల వేతనాల కోసం భేషజాలకు పోకుండా నిర్మాతలు పరిష్కారం కోసం పూనుకోవాలని సూచించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని కార్మికులకు న్యాయం జరిగే విధంగా పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. ఫిల్మ్‌ ఛాంబర్‌, నిర్మాతల మండలి కార్మికులతో చర్చలు జరిపి పరిష్కరించాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad