బాలికపై సామూహిక లైంగిక దాడి

మండవల్లి (ఏలూరు జిల్లా) : బాలికపై సమీప బంధువే ఇతరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఏలూరు జిల్లా మండవల్లి శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా పరిధిలోని నందివాడ మండలానికి చెందిన ఒక కుటుంబం చేపల చెరువుపై కాపలా ఉంటూ జీవనం సాగిస్తోంది. వారి కుమార్తె (10) హాస్టల్‌లో ఉంటూ సమీపంలోని జడ్‌పి హైస్కూల్లో ఐదో తరగతి చదువుతోంది. బాలికకు వరుసకు సోదరుడయ్యే కుటుంబం ఆ ప్రాంతంలోనే ఉండడంతో అప్పుడప్పుడు సోదరుని ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలోనే సదరు ప్రబుద్ధుడు బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా సోదరుడి కుటుంబం అద్దెకు ఉంటున్న ఇంటి యజమానికి కుటుంబానికి చెందిన మరో బాలుడు (13), మరో లారీ డ్రైవర్‌ (45) గత నాలుగు నెలలుగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. .

Spread the love