Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్6న కామారెడ్డిలో మెగా జాబ్ మేళా..

6న కామారెడ్డిలో మెగా జాబ్ మేళా..

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి : హెచ్సిఎల్ టేక్ బి ( HCL TechBee -) సంస్థలో జిల్లాలో  మే 6న (మంగళవారం) రోజున సాఫ్ట్వేర్  రంగంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో  హెచ్ సి ఎల్ టెక్నాలజీస్  వారు నిర్వహిస్తున్న టేక్ బి కార్యక్రమం  కొరకు  2024 –  2025 సంవత్సరం లో ఎంపీసీ, ఎంఈ సి, సిఇసి, బైపిసి, ఒకేషనల్ కంప్యూటర్ లలో ఇంటర్ పూర్తి చేసుకున్న  విద్యార్థులకు , మే 6న (మంగళవారం) రోజున ఉదయం 9 గంటలకు ప్రభుత్వ డిగ్రీ  (ఆర్ట్స్ మరియు సైన్స్) కళాశాల ఆడిటోరియం, కామారెడ్డి లో మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్  ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు.  కామారెడ్డి జిల్లాలో గతంలో 60 కి పైగా విద్యార్థులు  హెచ్ సి ఎల్ టెక్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. దీనిలో భాగంగా మే 6న జిల్లా లోని అర్హతగల ప్రతి ఒక్క విద్యార్థి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి  షేక్ సలాం, హెచ్ సి ఎల్ ప్రతినిధి తెలిపారు. జిల్లాలోని  ప్రభుత్వ, ప్రభుత్వ రంగ  ప్రవేట్ కళాశాలలో ఎంపీసీ, ఎంఈ సి, సిఇసి, బైపిసి, ఒకేషనల్ కంప్యూటర్ లలో 75 శాతం ఓవరాల్ గ 60 శాతం మ్యాతమాటిక్స్ లో మార్కులు పొంది అర్హులైన అభ్యర్థులు తమ (1) పదో తరగతి పాస్ సర్టిఫికెట్ నకలు,  ఇంటర్మీడియట్ 2025 సర్టిఫికెట్ నకలు, (3) ఆధార్ కార్డు నకలు, (5) ఆండ్రాయిడ్ మొబైల్ తో డ్రైవ్ స్థలానికి  హాజరుకావాలని కోరారు.  పూర్తి వివరాలకు ఈ క్రింది హెచ్.సి. ఎల్. ప్రతినిది సెల్ఫోన్ నెంబర్ ను 8074065803,  7981834205 సంప్రదించాలని కలెక్టర్ ప్రకటన లో తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad