నవతెలంగాణ న్యూఢిల్లీ : లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభా నియోజకవర్గంలోని మహదేవపుర అసెంబ్లీ స్థానంలోనే లక్ష కంటే ఎక్కువ దొంగ ఓట్లున్నాయి. ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కైందని రాహుల్ ఆరోపించారు. 40 మందితో కూడిన బృందం ఆరు నెలలపాటు నిర్వహించిన విశ్లేషణలో వేలాది నకిలీ ఎంట్రీలు, నకిలీ చిరునామాలు చెల్లని ఫొటోలు, అనుమానాస్పద ఫారం 6 దరఖాస్తులు బయటపడ్డాయి అని రాహుల్ పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. తను చేసే వాదనలను ధృవీకరిస్తూ అధికారిక ప్రకటనపై సంతకం చేయాలి లేదా దేశానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి ఎన్నికల సంఘం సవాల్ విసిరింది. రాహుల్ గాంధీ దగ్గర రెండు ఆప్షన్‌లే ఉన్నాయి. ఒకటి ఆయన చేసే ఆరోపణలు నిజమనుకుంటే.. డిక్లరేషన్‌పై సంతకం చేయడం లేదా.. ఈసిఐపై అసంబద్ధ ఆరోపణలు చేసినందుకు దేశానికి క్షమాపణలు చెప్పడం అని ఎన్నిక సంఘం వర్గాలు తెలిపాయి.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఈసీ సవాల్
- Advertisement -
- Advertisement -