నవతెలంగాణ – ధర్మసాగర్
గెలిపి లక్ష్యంగా ముందుకు సాగాలని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన,ఎమ్మార్పీఎస్ఉద్యమ కారుడు గంగారపు శ్రీనివాస్ప్రశాంత దంపతుల కుమారుడు గంగారపు ప్రభుదేవ్,10వ తరగతి సెయింట్ గాబ్రీయేల్ స్కూల్ ఫాతిమానగర్ నుండి ఈనెల04న హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన,సౌత్ జోన్ తెలంగాణ స్టేట్ మీట్ లో అండర్ 16 విభాగంలో 1000 మీటర్స్ రిలే పరుగుపందెం లో ప్రభుదేవ్ తన టీమ్,రక్షణు, సందీప్,రోహిత్ మొదటి స్థానం సాధించారు.ఈ విషయం తెలుసుకున్న పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ,ఈనెల 7 న (నిన్న) సాయంత్రం చింతగట్టులో జరిగిన సభలో ప్రభుదేవ్ ను ఆయన శాలువాతో ఘనంగా సన్మానించి, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని,త్వరలో జరుగబోయే జాతీయ స్థాయి పరుగు పందెంలో కూడ ప్రధమ స్థానంలో గెలుపొందాలని ఈ సందర్భంగా వారిని ఆశీర్వదించారు.
గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి: మందకృష్ణ మాదిగ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES