- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో వరలక్ష్మీ వ్రతం పూజలు మహిళలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం మహిళలు యువతులు వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారి విగ్రహాలను ఫోటోలను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పిండి వంటలతో చేసిన వివిధ రకాల వంటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ముత్తయిదులకు పిలిచి అయినాలు సమర్పిస్తారు.
- Advertisement -