Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మత్తు పదార్థాలు లేని సమాజం నిర్మిద్దాం: ఎస్సై

మత్తు పదార్థాలు లేని సమాజం నిర్మిద్దాం: ఎస్సై

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు శుక్రవారం భీమ్‌గల్ మండలంలోని బాబాపూర్ గ్రామ కమిటీ హాల్ లో ఎస్సై కే.సందీప్ ఆధ్వర్యంలో గ్రామ యువకులకు, ప్రజలకు గంజాయి అలాగే, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల నియంత్రణ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై  కే.సందీప్ మాట్లాడుతూ… గంజాయి, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే గుర్తుతెలియని వ్యక్తులు మీ మొబైల్ ఫోన్ కు ఫోన్ చేసి బ్యాంకు నుండి మాట్లాడుతున్నాము మీ అకౌంట్ లో ప్రాబ్లెమ్ ఉంది. తొందరగా ఈ నెంబర్ కు మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, డీటెయిల్స్ పంపించమని కాల్ చేస్తే, అలాంటి ఫోన్ కాల్స్ ని, వ్యక్తులను నమ్మకూడదని, మీకు బ్యాంక్ సమస్య ఉందని ఎవరన్నా కాల్ చేస్తే మీరే నేరుగా బ్యాంకు వెళ్లి మీ సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు.

అలాగే గంజాయి, మత్తుపదార్థాలు లేని సమాజం నిర్మించేందుకు యువత సహకరించాలని ఎస్సై అన్నారు.అలాగే యువకులకు గంజాయి, మత్తు పదార్థాల పై ఆసక్తి చూపకుండా ఉండేందుకు అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి, కల్తీ కల్లు బారిన పడడం ద్వారా కలిగే చెడును, ఆరోగ్య విషయాల పై, ఎవరైనా మత్తు పదార్థాల ను విక్రయించినా, వాటిని అలవాటు చేసుకోవాలని ఒత్తిడి చేసినా స్థానిక పోలీసులకు లేదా 1908 నెంబరుకు సమాచారం ఇవ్వాలని గ్రామ ప్రజలను, యువకులను ఎస్సై కోరారు.అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ..పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణ అవగాహన సదస్సు నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు.

ఇలాంటి విషయాలపై గ్రామస్తులకు అవగాహన కొరకు వచ్చి ఇంతటి సందేశాన్ని ప్రజలకు,యువతకు ఇచ్చినందుకు ఎస్సై కే.సందీప్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి నిత్యజీవితం పాడుగాకుండా పోలీస్ శాఖ తెలిపినట్టుగా తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ చూపి రాత్రి సమయంలో పిల్లలు ఇంటికి రాకపోవడం, ఇంటికి ఆలస్యంగా రావడం ఇలాంటి విషయాలపై తల్లిదండ్రులు ఎక్కువగా శ్రద్ధ చూపాలని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img